![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -351 లో.....భాస్కర్ కావాలనే నడవడం రానట్టు నటిస్తూ బుజ్జి అంటు కావ్యని పిలిచేసరికి.. కావ్య ఎందుకు నేనున్నాగా హెల్ప్ చెయ్యడానికి అంటూ భాస్కర్ ని పట్టుకొని రాజ్ నడిపిస్తు స్నానం చెయ్యడానికి తీసుకొని వెళ్తాడు. ఇక భాస్కర్ రాజ్ ని ఒక అట ఆడుకుంటాడు. ప్రతిసారీ బుజ్జి అంటు భాస్కర్ పిలుస్తుంటే. ఇప్పుడు కావ్య ఎందుకు నేను ఉన్నాను కదా అని అంటాడు. అలా రాజ్ తో అన్ని పనులు చేయిస్తాడు.
మరొకవైపు రుద్రాణి లేచి బయటకు వచ్చేసరికి.. అప్పుడే స్వప్న బయట ఫోటో షూట్ చేస్తుంటుంది. తనని చూసి కోపంగా ఇంట్లోకి వెళ్లి అందరిని పిలుచుకొని వస్తుంది. అందరు స్వప్న పొట్టి బట్టల్లో ఫొటోస్ తీయించుకుంటూ ఉంటే షాక్ అవుతారు. ఇక ధాన్యలక్ష్మి దొరికిందే ఛాన్స్ అన్నట్లుగా ఇంట్లో పద్ధతులు ఇలాగే ఉంటాయా అని అపర్ణని అంటుంది. ఇప్పుడేం అనకండి.. ఆ ఫోటోషూట్ అయ్యాక స్వప్నతో మాట్లాడుదామని సుభాష్ అంటాడు.. ఆ తర్వాత కావ్య, భాస్కర్ లు టిఫిన్ చేస్తుంటారు. కావాలనే కావ్య , భాస్కర్ కి ఇడ్లీ తినిపిస్తుంటే చూడలేని రాజ్.. ఫోన్ లో కోప్పడినట్టుగా చేసి ఆఫీస్ లో ఏదో వర్క్ ఉందని కావ్యని లాక్కొని వెళ్తాడు. ఆ తర్వాత రాజ్, కావ్య ఇంటికి వెళ్లేసరికి ఫోటోషూట్ చేస్తున్న స్వప్నని చూసి షాక్ అవుతారు. దాని తర్వాత స్వప్న ఇంట్లోకి వెళ్తుంటే రుద్రాణి ఆపి.. ఇంట్లోవాళ్ళు వద్దన్న కూడా ఎందుకు ఇలా చేస్తున్నావని అడుతుంది. డబ్బు కోసం నా భర్త, అత్తలు వాళ్లకు సంబంధం లేదని వదిలేసారు. నాకు అవసరం ఉంటుంది కదా వాళ్ళు పట్టించుకోనప్పుడు ఏం చేస్తాను.. ఏదైనా ఉంటే నా పుట్టింటి నుండి తెచ్చుకోవాలంట అని స్వప్న చెప్తుంది. మీ పుట్టింటి వాళ్ళకి గతి లేకే ఈ ఇంటికిపై ఆశ పడుతున్నారని ధాన్యలక్ష్మి అంటుంది.
ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళేం అన్నారని కావ్య అంటుంది. అది నిజమే కదా అందకే కదా కళ్యాణ్ కి అప్పుని ఇచ్చి పెళ్లి చెయ్యాలి అనుకున్నారని అనామిక అంటుంది. ఎవరు పుట్టింటికి ఎంత అందిందో ఇప్పుడు టాపిక్ కాదని రాజ్ అంటాడు. స్వప్న మాట్లాడే దాంట్లో న్యాయం ఉంది, భర్త, అత్త పట్టించుకోకపోతే ఏం చేస్తారని అపర్ణ, సుభాష్ ఇందిరాదేవిలు అంటరు. విషయం మా వరకు వచ్చింది కదా మేం చూసుకుంటాం.. నువు లోపలికి వెళ్ళు స్వప్న అని ఇందిరాదేవి అంటుంది. తరువాయి భాగంలో నువు వెళ్లి నీ మనసులో కావ్యపై ఉన్న ప్రేమని చెప్పమని రాజ్ మనసాక్షి చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |